నీ మీద మనసాయరా 5

telugu sex stories boothu kathalu అతను ఓ క్షణం ఆగి మళ్ళీ చెప్పాడు.

“ఈ కారణం చేతనే మీ గురించి అంతా తెలుసుకున్నాను. ఓ రేడియో స్టేషన్ కు ట్యూన్ చేసిన రేడియో రిసీఉ చేసుకున్నట్లు మీ ఆలోచనలు తప్ప మరేమీ రావు నాకు. నీటిమడుగులో మొసలి పట్టేసుకున్నప్పుడు గజేంద్రుడు అరిస్తే వైకుంఠములోని విష్ణువుకు ఎలా తెలిసిందనుకుంటున్నారు? ఇలానే అందుకే ఆయన గజేంద్రుడు అరిస్తే వైకుంఠములోని విష్ణువుకు ఎలా తెలిసిందనుకుంటున్నారు? ఇలానే అందుకే ఆయన గజేంద్రుడు కేక వినగానే “సిరికింజెప్పడు శంఖుచక్రగదమున్ చేదోయి సంధికిపడు”- అన్నట్లు పరుగెత్తాడు. ఇంతకు ముందు కూడా అదే జరిగింది. మీరు ఎగ్జిబిషన్ ను చూడడానికి రాకపోతే ఏదో అయిందనిపించింది. నా రక్తకణాలన్నీ మూలిగాయి. మీకేదో అయినట్లు తెలిసిపోయింది. ఏం జరిగుంటుందో ఊహించాను. అందుకే కారు తీసుకుని బయల్దేరాను. నా ఊహ నిజమైంది”

ఆమె ఎంత డీప్ షాక్ కు గురైందంటే హోటల్ రావడం, కారును అతను పార్క్ చేయడం కూడా గమనించలేకపోయింది.

“దిగండి హోటల్ కి వచ్చేశాం” డోర్ తెరిచి అన్నాడు అతను.

కారు దిగి నిద్రలో నడిచినట్లు వసంత్ పక్కన నడిచింది సూర్యాదేవి.

కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళగానే సుస్మిత ఎదురొచ్చి, “ఇప్పుడా రావడం! అంతా సర్దెయ్యడానికి ప్రిపేర్ అవుతున్నాము” అంటూ ఆమె రెండు చేతులు పట్టుకొని లోపలకు తీసుకెళ్ళింది.

సూర్యాదేవికి మొత్తం జరిగిందంతా చెప్పాలనిపించింది. ఆ కోరికను బలవంతంగా అణుచుకుని, “మధ్యలో కారు ట్రబులిచ్చింది” అంది.

“రారా! పెయింటింగ్స్ చూద్దువుగానీ”

మొదటి నుంచి ఒక్కో పెయింటింగ్ చూపుతోంది సుస్మిత. పెయింటింగ్స్ ని చూస్తూ వసంత్ కోసం అప్పుడప్పుడు గమనిస్తూ వుంది గానీ అతడు కనిపించడం లేదు. ఏమైపోయాడు!

చివరి చిత్రం చూసి, “అన్నీ బాగున్నాయి సుస్మితా కంగ్రాట్స్” అంది. గుండెలోతుల్నుంచి ఆ మాటలు రావడంతో బరువుగా తోచాయి.

“థాంక్స్”

“మరి నేనిక వెళ్ళొస్తాను” అని రెండు చేతులు జోడించి అక్కడి నుంచి బయటికి నడిచింది.

“ఎలా వున్నాయి పెయింటింగ్సు?” ఎదురుగా వచ్చి అడుగుతున్న వసంత్ ను అలా చూస్తుండిపోయింది. అతను ఠక్కున ప్రత్యక్షమైనట్లు అనిపించింది.

“ఇటు రండి. గుండెను కోటిముక్కలు చేసి మిమ్మల్ని అభిషేకం చేయాలన్న నా ఆవేశాన్ని  చూద్దురు గానీ” అని ప్రక్కనున్న టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడ నోటుబుక్కులు చాలా వున్నాయి.

“చూడండి” అంటూ ఓ బుక్కును ఆమె కందించాడు.

వణుకుతున్న పలకమీద నీలాలు పొదిగినట్లు పేజీల నిండా ఆ పేరే. రక్తమంతా గుండెల్లోకి చేరిపోయి నట్లనిపించింది ఆమెకు. ఏవేవో భావాలు శరీరంలో ఇంద్రధనసుల్ని సృష్టిస్తున్నాయి. సప్తరంగుల వర్షంలో తడుస్తున్నట్లే వుంది.

“ఈ నోట్ బుక్స్ లో అంతా మీ పేరే. కోటిసార్లు రాశాను. మీరు తప్ప మరేదీ గుర్తు రాకుండా వుండడం కోసమే రాశాను” అని ఆమె ముందుకి మరింత జరిగి “ఐ లవ్ యు” అన్నాడు.

ఒకానొక అలౌకిక స్థితిలో – తుపానుకు ఊగుతున్న పడవలా అయి పోయింది ఆమె.  గుండెల్లో ఎగసిన ఉద్వేగం తన కళ్ళలో నీళ్ళులా ప్రవహిస్తోంది. తలవంచి కళ్ళను కర్చీఫ్ తో అద్దుకుని తల పైకెత్తింది.

అప్పటికే అతను వెళ్ళిపోయాడు.

                                     6

సూర్యాదేవి, మహిత భోజనాలు ముగించి బాల్కనీలోకి వచ్చి కూర్చున్నారు.

అప్పుడు రాత్రి ఎనిమిది గంటలైంది. ఎవరో దేవకన్య పడుకునే ముందు తన పాపటిబిళ్ళను కొక్కానికి తగిలించినట్లు ఆకాశంలో చంద్రవంక వేలాడుతోంది. వడ్డాణాన్ని అలా విసిరేసినట్లు తెల్లటి మబ్బుల చారపట్టీలా కనిపిస్తోంది. కాలిగజ్జల్ని నిర్లక్ష్యంగా పారేసినట్లు నక్షత్రాలు మెరుస్తున్నాయి. ముత్యాలహారాన్ని పడకమీద నుంచే విసరడం వల్ల అది తెగి భూమి మీదకి జారి, చెల్లాచెదురైనట్లు కనిపిస్తున్నాయి.

“చాలా రోజుల తరువాత వచ్చావ్. ఏమైపోయావ్ ఇంతకాలం నువ్వొచ్చి దాదాపు ఆరునెలలైందనుకుంటా” సూర్యాదేవి అడిగింది.

“అవును. ఈ మధ్య టౌన్ కి రావడం కుదరడం లేదు. ఎప్పుడేని వచ్చినా డాక్టర్, ఓ సినిమా, ఏదో బజార్లో కొనడం, సాయంకాలానికి యిల్లు చేరడము-ఈరోజు కూడా వెళ్ళిపోవాలనుకున్నాను డాక్టర్ లేదు. రేపు ఉదయం వస్తుందంటే వుండిపోయాను. నిన్ను చూసి చాలా రోజులయిందని ఇటొచ్చాను”

“ఏమిటి ప్రాబ్లెమ్?” అడిగింది సూర్యాదేవి.

“నడుంనొప్పి, మరీ సీరియస్ కాదనుకో డాక్టర్ కి చూపిస్తే బెటర్ కదా అని వచ్చాను”

“మహిత ఇంటర్ లో సూర్యాదేవి క్లాస్ మేట్ పక్క ఊరే, టౌన్ కి వచ్చేటప్పుడు సూర్యాదేవి ఇంటికి వచ్చేది. దాంతో ఇద్దరి మధ్యా స్నేహము కుదిరింది.

ఆమెకి సూర్యాదేవి వయసే. వివాహం అయి ఆరేళ్ళయింది. ఒక్కడే బాబు చాలా అందంగా వుంటుంది. ఛామనఛాయే అయినా అదో రకమయిన సెక్సీతనంతో వుంటుంది. ఆ సెక్సీతనం ఆమె మత్తుకళ్ళల్లో వుందో, తేనెపూత పూసినట్లుండే పెదవుల్లో వుందో, ఎట్టయినా వక్షస్థలంలో వుందో, రెండు కొండ శిఖరాలను కలుపుతూ వేసిన పూలవంతెనలా వుండే నడుంలో వుందో చెప్పడం కష్టం. ఛామనఛాయ రంగులో వుండే శరీరం- అంతగా మెరవడం అరుదు ఆ రంగువల్లే అంత సెక్సీతనం వచ్చిందేమో తెలియదు.

“ఇంకేమిటి విశేషాలు?” సూర్యదేవికి ఎవరయిఅన గెస్ట్ లు వస్తే పండుగే జగదీష్ తో తప్ప ఎవరితోనూ ఫ్రీగా మాట్లాడే వీలులేదు ఆ ఇంట్లో వంటవాడితో పనిమనుషులతో మాట్లాడేందుకు ఏం వుంటాయి? కానీ జగదీష్ ఇంట్లో వుండడం బహు తక్కువ అందుకే ఎవరయినా ఫ్రెండ్స్ వస్తే మాట్లాడడానికి మనిషి దొరికిందన్న ఆనందం ఎక్కువైపోతుంది.

ఆరోజూ తను ఆలస్యంగా వస్తానని, సూపర్ స్పెషాలిటి ఆసుపత్రికి సంబంధించైనా బిల్స్ తయారుచేసే పనివుందనీ జగదీష్ ఫోన్ చేసి చెప్పడంతో తీరిగ్గా మాట్లాడడానికి కూర్చుంది.

“మాలాంటివాళ్ళకి విశేషాలు ఏం వుంటాయి సూర్యా! అంతా మామూలే ఏవేవో ఊపిరిసలపని సమస్యలు. ఎప్పుడూ కష్టాలే డబ్బు లేకపోవడము వల్ల వచ్చే ఇబ్బందులతోనే కాలం గడిచిపోతూంటుంది” నిరాసక్తంగా జవాబు చెప్పింది మహిత.

“ఏమీ సమస్యలు లేకపోవడమే పెద్ద సమస్య. సమస్య వున్నప్పుడు దాన్ని పరిష్కరించడానికి ఏదో ఒకటి చేస్తాం. కానీ సమస్యే లేనప్పుడు దాన్ని ఎలా పరిష్కరించడం? అందుకే అది పెద్ద సమస్య”

“ఇందులోనూ నిజం లేకపోలేదని అంగీకరిస్తానుగానీ మాలాంటి కుటుంబాలు నిత్యం ఎంతగా కుమిలిపోతుంటాయో అనుభవిస్తేగానీ తెలియదు. ముఖ్యంగా పల్లెటూళ్ళలో వ్యవసాయం తప్ప మరే ఆదాయం వుండదు. బొటాబొటిగా ఆదాయం అదీ సంవత్సరానికి ఒకసారి. ఎప్పుడో వచ్చే ఆ కాసింత ఆదాయాన్ని నమ్ముకుని సంవత్సరమంతా అప్పులు.

తీరా పంట చేతికి అందినప్పుడు ధరపలకదు. అవతల అప్పులవాళ్ళు యమదూతల్లా ఇంటి చూరు పట్టుకుని వేలాడుతుంటారు.

యమభటుల చేతుల్లో కత్తులూ  కఠార్లూ వుంటే వీళ్ల దగ్గర బాండు పత్రాలుంటాయి.

అందుకే వచ్చిన ధరకే పంటనంతా అమ్ముకోవాల్సి వస్తుంది. మళ్ళీ అప్పులు అప్పు అంటే ఎప్పటికీ మమ్మల్ని వదిలిపోని గజ్జి, గోక్కుంటూ వుంటే మరింతగా చర్మము చిట్లడము తప్ప దురదపోదు.

పల్లెటూరులో వున్నా నీ కుంటుంబంలాంటి కుటుంబాల కథ వేరు. మీరు భూస్వాములు కాబట్టి సంవత్శరానికి వచ్చినా లక్షల్లో ఆదాయం వుంటుంది ఎకరా, రెండెకరాలు వున్నవాళ్ళ బతుకులే పరమనీచం”

“నిజమే కానీ డబ్బులున్నా, దాన్ని ఎంజాయ్ చేయలేనివారున్నారు నాలాగా. బాధలేకపోవడమే ఆనందం అనుకుంటే నేను చాలా ఆనందంగా వుండాలి కానీ అది నిజం కాదు. ఆనందం అనేది వేరే వుంది. ఈ సత్యం తెలిసిపోవడమే నా సమస్య.”

“బాధల్లోంచి ఆనందము వెతుక్కోవడమే మాకు చేతనైంది. పల్లెటూళ్ళో జరిగే కొన్ని సంఘటనలు వినడంతోటే ఎంతో నవ్వొస్తుందో! కానీ వాటిని తరచి చూస్తే పేదరికం విశ్వరూపం కనిపిస్తుంది. ఈ మధ్య మా వూర్లో ఇలాంటిదే జరిగింది”

“ఏం జరిగింది?” సూర్యాదేవి కాస్తంత ముందుకి వంగి అడిగింది. పూలబరువుకి వంగిన లతలా వుంది ఆమె ఆ మసక వెలుతురులో.

మహిత చెబుతుంటే ఇంట్రస్టింగ్ గా వింటోంది.

“మా వూర్లో శశిరేఖ అనే అమ్మాయి ఉంది. సన్నగా ఉండడానికీ, నాజూగ్గా ఉండడానికి చాలా భేదం వుంది. చాలామంది అమ్మాయిలకు యిది తెలియక సన్నగా ఉండడానికి డైటింగ్ పేరుతో బక్కగా తయారవుతారు. కానీ శశిరేఖ నిజంగానే చాలా నాజూకుగా వుండేది. మల్లెతీగకు సృష్టివైపరీత్యము వల్ల బత్తాయిపళ్ళు కాసినట్లు యెదమాత్రము యెత్తుగా వుండేది. సాయంకాలం ఆరుపైన ఆమె నడుము కనిపించేది కాదు – అంత సన్నగా వుండేది నడుము.

కాళ్ళకు వెంట్రుకలు కాస్తంత ఎక్కువగా వుండేవి. అలా వుంటే స్త్రీలకు కోరిక ఎక్కువ అని చాలామంది మూర్ఖులు నమ్ముతారు.

అందుకే పెళ్ళికాని శశిరేఖ కోసం చాలామంది అబ్బాయిలు గట్టిగానే ప్రయత్నాలు ప్రారంభించారు.

వాళ్ళల్లో దీపక్ ఒకడు. ఆమె యెదురిల్లే అతనిది. కాస్త కలిగిన కుటుంబం. పదెకరాల మాగాణి వుండేది. శశిరేఖది పేద కుటుంబం. తల్లీ తండ్రీ, అన్నా వదినా ఉన్నారు. సొంతంగా భూమి అనేది లేదు వాళ్ళకి ఆమె అన్న పాల వ్యాపారం చేసేవాడు. ఊర్లో పాలుపట్టి టౌన్ కి తీసుకెళ్ళి హోటళ్ళకు పోసేవాడు. ఆ ఆదాయంతోనే ఇల్లు గడిచేది.

దీపక్ శశిరేఖ మీద ఎంత కోరిక వున్నా, ధైర్యం, చొరవా లేవు కాబట్టి ముందుకు పోలేకపోయాడు. ఏదో బిడియం, జంకూ అతన్ని వెనక్కి లాగేవి.

శశిరేఖ ఎప్పుడోగానీ ఇంట్లోంచి బయటికిరాదు. సాయంకాలం బావి దగ్గరికి నీళ్ళకు వచ్చేది. ఆ టైమ్ లో మాత్రం దీపక్ తన ఇంటి తిన్నె మీద కూర్చునేవాడు ఆమెను చూస్తూ గుటకలు మింగేవాడు.

అంతలో శశిరేఖకి పెళ్ళి సంబంధం కుదిరింది. పెళ్ళికొడుకు తన స్వంత ఊరిలో టీ కొట్టు నడుపుకుంటున్నాడు. కట్నం ఏమీ అడగలేకపోవడంతో మరో ఆలోచన లేకుండా శశికి పెళ్ళి చేసేశారు.

ఆమెకి పెళ్ళి అయినా దీపక్ మాత్రం తన ఇష్టాన్నిచంపుకోలేదు ఆమెతో గడపాలన్న కోరిక తప్ప పెళ్ళి చేసుకునే ఉద్దేశం అతనికి లేదు. అందువల్లే ననుకుంటా అతను తన మోహాన్ని చంపుకోలేదు.

పెళ్ళయి సంవత్సరం అయిపోయింది. వేసవికాలంలో పర్మినెంట్ గా శశి పుట్టింటికి వచ్చేసింది. అక్కడ టీ అంగడి బాగా జరక్కపోవడంతో ఇక్కడికి వచ్చేశారన్నమాట. శశిభర్త బస్టాండ్ లో టీ అంగడి ఓపెన్ చేశాడు. పల్లెటూరిలో డబ్బులిచ్చి టీ తాగేవాళ్ళెవరు? ఏదో దానికి దానికి సరిపోయేటట్లు జరిగేది.

మూడు కుటుంబాల మధ్య మనస్పర్ధలు బయల్దేరాయి. ఒకే లోగిలిని మూడు భాగాలుగా చేశారు. శశీవాళ్ళు, శశీవదిన అన్నయ్యవాళ్ళు విడివిడిగా రెండు గుడిసెలు వేసుకున్నారు. పాత ఇంటిని ముసలివాళ్ళ కిచ్చేశారు. ఎవరి బాధలు వాళ్ళు పడుతున్నారు. పూట గడవడమే కష్టంగా తయారైంది మూడు కుటుంబాలకు.

దీపక్ టీ అంగడికెళ్ళి, శశి కుటుంబం ఎంత కష్టాల్లో వుందీ పసికట్టాడు. ఇదే మంచి సమయమని అనుకున్నాడు. ఓ రోజు దాహిర్యం చేశాడు.

సాయంకాలం సంజెచీకట్లు ముసురుకాగానే ఓ నోటు బుక్కు కాగితం, పెన్సిలూ సంపాదించాడు.

“శశీ! నీవు నాతో పర్మినెంటుగా స్నేహం చేస్తానంటే సంవత్సరానికి ఇరవైమూతల వడ్లు ఇస్తాను” అని రాసి, కింద తన పేరు రాశాడు.

ఓ చిన్నపిల్లని పిలిచి – “రంగమ్మా! దీన్ని తీసుకెళ్ళి అదిగో అక్కడ పెరట్లో గిన్నెలు తోముతూ వుండే శశిరేఖ- ఆవిడకి ఇచ్చెయ్” అని చెప్పాడు.

ఆ పిల్ల ఉత్తరం తీసుకుని వెళ్ళింది.

పెరట్లో దూరి శశికి ఇచ్చింది.

ఆమె దాన్ని చదివింది. విషయం అర్ధమైంది.

“ఇంట్లో టేబుల్ మీద పెన్సిల్ వుంది తీసుకురా” అంది.

ఆ పిల్ల పెన్సిల్ తీఉస్కురాగానే, “నేను రెడీ” అని రాసి, కింద తన సంతకం లేకుండా మడతపెట్టి-

“ఇది ఇచ్చేయ్” అని తిరిగి అదే ఉత్తరాన్ని ఇచ్చి తన పనిలో పడింది.

రంగమ్మ దాన్ని తీఉస్కుని ముందుకు కదిలింది. ఇదంతా తన యింట్లో, కూర్చుని గమనించిన శశి వదిన కాంచన ఆ పిల్లని లోపలికి పిలిచింది.

“ఏదీ! అదిటివ్వు!” అడిగింది రహస్యంగా.

“దీపక్ దీన్ని ఎవరికీ ఇవ్వద్దన్నాడు”

“ఫరవాలేదులే! ఇటివ్వు” అని లాక్కుంది.

కిరసనాయిలు దీపం వత్తి ఎక్కించి మొత్తం చదివింది. ఏం జరిగిందో తెలిసింది. తను చేయాల్సిందేమిటో కూడా వెంటనే తట్టింది. చాకలి పద్దులు రాయడానికి వుంచిన పెన్సిల్ ను తీసుకుని, “నేను కూడా రెడీ- పది మూటలు వడ్లు ఇవ్వు చాలు” అని రాసి, తన సంతకం చేసి ఇచ్చింది.

ఏం జరుగుతూ వుందో తెలియని రంగమ్మ ఉత్తరాన్ని తీసుకుని బయటికి నడిచింది.

ఇంకెవరయినా ఉత్తరం తీసుకుని చదువుతారనే భయంతో రెండు చేతుల్నీ వెనక్కి పట్టుకుని నడవడం ప్రారంభించింది. ఇక వీధిలోకి అడుగువేసేటంతలో శశితల్లి లోపలికి వచ్చింది. వెనక్కి చేతులు పట్టుకుని, భయం భయంగా చూస్తున్న రంగమ్మను పరిశీలించి అనుమానం వేసింది.

మరిన్ని 2018 కొత్త కథలు

గెలుపుకోసం

చదరంగం

ఓ అందమైన లలిత మాలతిల కథ

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం

సునీత- నా కలల రాణి 

నా ముగ్గురు పెళ్లాలు  

ఒక కుటుంబం

ఒక్కసారి అలుసిస్తే!?  

మంత్రాలు – చింతకాయలు

రెచ్చిపోయిన అమ్మాయిలు

అమ్మ-నీ పొదుగు   

కలసి వచ్చిన అదృష్టం

ఫ్యామిలీ కథ చిత్రం 

శృంగార మధనం: సంజయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *